బీజేపీ సంచలన నిర్ణయం.. మహారాష్ట్ర సీఎంగా

బీజేపీ సంచలన నిర్ణయం.. మహారాష్ట్ర సీఎంగా

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు. ఫడణవీస్‌, శిందే కలిసి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమకు ఉందని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం ఈ అనూహ్య ప్రకటన వెలువడింది. రాజ్‌భవన్‌లో శిందే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఫడణవీస్‌ వెల్లడించారు.

 

Tags :