ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. 20 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 తుది గడువు. ఆగస్ట్‌ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడిరచింది. అదే రోజు కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించి ఫలితం కూడా వెల్లడిరచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు కొనసాగుతోన్న విషయం విదితమే. వెంకయ్య నాయుడు 2017 ఆగస్టు 11వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

 

Tags :