ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే సాంకేతికతకు సంబంధించి న్యూరాలింక్‌ అధినేత ఎలానన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు. బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ) సాంకేతికతను మరో ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.  కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న  న్యూరాలింక్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తో పాటు దాని పుర్రెలో అమర్చ గలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన అనుమతుల కోసం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదిలించగలిగేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు ఓ చిప్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. చూపు కోల్పోయిన వారికి సైతం సాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

 

Tags :