ప్రకటనలు వద్దంటే డబ్బులు కట్టాలి : ట్విట్టర్

ట్విట్టర్లో కొత్త సబ్స్క్రిప్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి యాడ్లు కనపడవని తెలిపారు. అయితే, ఈ సబ్‌స్క్రిప్షన్‌కు ఎంత ఫీజు నిర్ధారించారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. రానున్న వారాల్లో ఇది అమలు చేస్తామని తెలిపారు. కాగా ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లను మానిటైజ్ చేసుకోవచ్చా అని ఓ యూజర్ మస్క్‌ను ప్రశ్నించగా ట్వీట్ కింద ఒక యాడ్‌ను పెట్టడం ద్వారా మానిటైజ్ చేసే అవకాశం ఉండొచ్చని మస్క్ రిప్లై ఇచ్చారు.
Tags :