MKOne Telugu Times Youtube Channel

డొనాల్డ్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం తప్పే

డొనాల్డ్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం తప్పే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ట్విట్టర్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. ఈ ప్రకటనపై ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సీ స్పందించారు. మస్క్‌ ప్రకటనతో ఏకీభవించారు. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధించిన సమయంలో సీఈవోగా ఉన్న డోర్సీ ఇప్పుడీ  ప్రకటన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను నిషేధించడం వ్యాపార నిర్ణయం అని, అలా చేసి ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌ తన నిర్ణయాన్ని ఎప్పుడూ పున సమీక్షించుకుంటూ ఉండాలని, అవసరమైన విధంగా అభివృద్ధి చెందుతూ ఉండాలని అభిప్రాయపడ్డారు. శాశ్వత నిషేధాలు కంపెనీ వైఫల్యానికి నిదర్శనమని, అవెప్పుడూ పనిచేయవని అన్నారు. చట్టవిరుద్దమైన ప్రవకర్తన, స్పామ్‌, లేదంటే నెట్‌వర్క్‌ మానివ్యులేషన్‌ వంటి వాటితో ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే శాశ్వత నిషేధం విధించాలని డోర్సీ తెలిపారు.

 

 

Tags :