కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం

కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా స్విమ్మర్‌ ఎమ్మా మెక్‌కియోన్‌ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగంలో బంగారు పతకం గెలవడం ద్వారా కామన్‌వెల్త్‌ క్రీడల చరిత్రలో అత్యంత విజయవంతంగా అథ్లైట్‌గా అవతరించింది. బర్మింగ్‌హోమ్‌లో ఇప్పటికే 4 గోల్డ్‌ మెడల్స్‌ (మిక్స్‌డ్‌  4I100 ఫ్రీస్టైల్‌, 4I100 ఫ్రీస్టైల్‌, 50 బటర్‌ఫ్లై) సాధించిన ఎమ్మా గత రెండు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 8 పతకాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన అథ్లెట్‌గా రికార్డులోకెక్కింది. గతంలో ఆస్ట్రేలియాకే చెందిన ఇయాన్‌ థోర్ప్‌, సూసీ ఓ నీల్‌, లీసెల్‌ జోన్స్‌లు తలో 10 బంగారు పతకాలు సాధించారు. తాజాగా ఎమ్మా వీరి పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టి కామన్‌వెల్త్‌ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది.

 

Tags :