భారత్ ప్రకటనను.. తిరస్కరించిన పాక్

భారత్ ప్రకటనను.. తిరస్కరించిన పాక్

ఫిబ్రవరి 2019 లో వైమానికి పోరాటంలో ఎఫ్‌-16 జెట్‌ ఫ్లైటవర్‌ను భారత్‌ ఫైలట్‌ కూల్చివేశాడన్న ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది. భారత్‌ ప్రకటన నిరాధారమని స్పష్టం చేసింది. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ మిగ్‌ 21తో ఎఫ్‌-16ను కూల్చివేయడం, ఈ క్రమంలో అతను పాక్‌ భూభాగంలో అడుగు పెట్టడం, పాక్‌ సైన్యం బంధించడం, ఆ తర్వాత మార్చి 1న అతడిని విడిచిపెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. అభినందన్‌ తెగువకు గుర్తింపుగా అతనికి రాష్ట్రపతి చేతుల మీదుగా వీరచక్ర పురస్కారం ప్రదానం జరిగింది. అయితే, భారత ప్రకటనను పాకిస్తాన్‌ తిరస్కరించింది. ఎఫ్‌-16 ఫైటర్‌ను కూల్చివేసినట్లు  పేర్కొనడం పూర్తిగా నిరాధారమని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 

Tags :