నాటోలో స్వీడన్ చేరికకు మేం ఒప్పుకోం

నాటోలో స్వీడన్ చేరికకు మేం ఒప్పుకోం

నాటో కూటమిలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న స్వీడన్‌కు తమ మద్దతు ఉండబోదని తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగాన్‌ స్పష్టం  చేశారు. స్టాక్‌హోమ్‌లో ఇటీవల ఇస్లామ్‌ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్సస్‌ పాలుదన్‌ అనే ఆందోళకారుడు  పవిత్ర ఖురాన్‌ ప్రతిని కాల్చడాన్ని ఎర్దోగాన్‌ తప్పుపట్టారు. ఇది ముస్లింలు సహా అందరికీ అవమానకరమన్నారు. స్టాక్‌ హోమ్‌లో తుర్కియే రాయబార కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శనలకు స్వీడన్‌ అధికారులు అనుమతిచ్చారని దుయ్యబట్టారు. ఆ దేశంలో కుర్దిష్‌ వర్కర్స్‌  పార్టీ (పీకేకే) జెండాలను ప్రదర్శించడాన్నీ ఆయన తప్పుపట్టారు. తుర్కియేలో పీకేకను ఉగ్రవాద ముఠాగా పరిగణిస్తారు. 

 

 

Tags :