బీజేపీలో మంత్రి ఎర్రబెల్లి సోదరుడు?

బీజేపీలో మంత్రి ఎర్రబెల్లి సోదరుడు?

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇటీవల హుజూరాబాద్‌లో బీజేపీ చేరిక కమిటీ కన్వీనర్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యాక.. వరంగల్‌ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరించడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు  చేరిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది. ప్రదీప్‌రావు వరంగల్‌లో తన అనుచరులతో సమావేశం కానున్నారని సమాచారం. కాగా, పార్టీ మారడం పై ఆయన ఎక్కడా అధికారికంగా మాట్లాడలేదు.

 

Tags :