దమ్ముంటే ఆ 12 మంది ఎమ్మెల్యేలు... రాజీనామా చేయాలి

దమ్ముంటే ఆ 12 మంది ఎమ్మెల్యేలు... రాజీనామా చేయాలి

దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలిచిన పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికకకు సిద్ధం కావాలంటే దమ్ము ఉండాలన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తే కేవలం ఐదు నిమిషాల్లో ఆమోదించారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కొందరు పార్టీ మారి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొనసాగుతున్నారని విమర్శించారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసిన ప్రజాభిప్రాయాన్ని కోరాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Tags :