రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా ఆయనకు లేదు... కానీ దేశాన్ని

రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా  ఆయనకు లేదు... కానీ దేశాన్ని

కేసీఆర్‌ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తూ సమస్యల పరిష్కారాన్ని పక్కదోవ పట్టిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా ఆయనకు లేదు గాని, దేశాన్ని బాగు చేస్తా అంటుండు అని ఎద్దేవా చేశారు. సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని గుజరాత్‌ ఎన్నికలు మరోసారి నిరూపించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామాన ప్రజా భరోసా యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే కేసీఆర్‌కు తెలంగాణకు బంధం తెగిపోయిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ లేవనెత్తుతున్నారు. ఆ సెంటిమెంట్‌తో మళ్ళీ తెలంగాణ ప్రజల్ని కేసీఆర్‌ మోసం చేయలేరని అన్నారు.

 

 

Tags :