ఆ స్కామ్ లో ఉన్నవారికి శిక్ష తప్పదు : ఈటల

లిక్కర్ స్కామ్ లో ఉన్నవారికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కామ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. తెలంగాణ చాలదన్నట్లు దోచుకోవడానికి ఢిల్లీపై పడ్డారని విమర్శించారు. బీజేపీ కాదు కుట్రలకు కేరాప్ ఆడ్రస్ కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. టీఆర్ఎస్ను మట్టికరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. అమరవీరులకు తెలంగాణ ప్రభుత్వం మరిచిందని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు.
Tags :