సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ.. దేశ రాజకీయాల్లో ఏదో

సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ.. దేశ రాజకీయాల్లో ఏదో

తెలంగాణలో సరైన పరిపాలన అందించలేని సీఎం కేసీఆర్‌ ఏం సాధించాలని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేదు, సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ దేశ రాజకీయాల్లో ఏదో ప్రభావం చూపిస్తానంటూ పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పకపోతే తెలంగాణకి అరిష్టమని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా బిల్లులు చెల్లించడం లేదన్నారు.  రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలమీద పన్నుల భారం మోపారన్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి రూ.25 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు అని విమర్శించారు.

 

Tags :