వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో...బీజేపీ ప్రభుత్వం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో...బీజేపీ ప్రభుత్వం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్‌ రైతులకు డబ్బులిచ్చారు, మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మేమే గద్దె దించుతామని అన్నారు. కేసీఆర్‌ శవ రాజకీయాలకు తెర లేపారని విమర్శించారు. కేసీఆర్‌ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు.

 

Tags :