బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కీలక పదవి ?

బీజేపీ ఎమ్మెల్యే ఈటల  రాజేందర్‌కు కీలక పదవి ?

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీనియర్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమించేందుకు జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పక్షాన ఈటల ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను తీసుకెళ్లి కేసీఆర్‌ సెంటిమెంట్‌ రాజకీయాలకు చెక్‌ పెట్టవచ్చని, పార్టీకి మంచి ఫలితాలు రాబట్టవచ్చనే అభిప్రాయంతో నాయకత్వం ఉన్నట్టు సమాచారం. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్‌ తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఇవ్వకుండా ఈటల అస్త్రాన్ని ప్రయోగించాలనే ఆలోచనలతో జాతీయ నాకయత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

 

Tags :