ఇక్కడ విమర్శలు చేస్తున్న కేసీఆర్.. అక్కడ వంగి వంగి దండాలు

ఇక్కడ విమర్శలు చేస్తున్న కేసీఆర్.. అక్కడ వంగి వంగి దండాలు

కేంద్ర ప్రభుత్వం పై ఇక్కడ విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్‍ ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‍ పతనానికి హుజూరాబాద్‍ ఉప ఎన్నికే నాంది అని అన్నారు. నోట్ల కట్టలు, మందు సీసాలు తమ గెలుపును ఆపలేవన్నారు. ప్రగతి భవన్‍లో కూర్చుని తన గొంతు పిసికేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్‍, హరీష్‍రావులే తన మీద పోటీకి రావాలని సవాల్‍ విసిరారు. ఒకవేళ తాను ఓడిపోతే  రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.

 

Tags :