అదృష్టం అంటే ఇదే.. లాటరీలో రూ.1,800 కోట్లు

యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్ లాటరీని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. లక్కీడిప్‌లో జో (49), జెస్‌థ్వైట్ (44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్ పౌండ్ల) జాక్‌పాట్ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న మీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు. భరత జో కమ్యూనికేషన్స్ సేల్స్ మేనేజర్ కాగా, జెస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని, జో జెస్ ఆనందం వ్యక్తం చేశారు. 2019లో ఓ గుర్తు తెలియని వ్యక్తి గెలుచుకున్న 170 మిలియన్ పౌండ్ల భారీ లాటరీ ఇప్పటి దాకా రికార్డుగా ఉంది.
Tags :