ఫేస్‌బుక్ కు షాక్... రూ.10,000 కోట్ల

మెటా (ఫేస్‌బుక్)కు గట్టి దెబ్బే తగిలింది. గోప్యతా అపరాధ రుసుము కింద 1.3 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.10,000 కోట్ల) ను చెల్లించాలని మెటాను యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆదేశించింది. ఐరోపా వినియోగదార్ల డేటాను అమెరికాకు బదిలీ చేయడం అక్టోబరు కల్లా నిలిపేయాలనీ తెలిపింది. తమపై ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటే ఈయూలో సేవలు నిలిపేస్తామని గతంలో పేర్కొన్న మెటా, ప్రస్తుతానికి ఐరోపాలో ఫేస్ బుక్ కార్యకలాపాలకు ఎటువంటి అవాంతరాలూ ఉండవని తెలపడం గమనార్హం.
Tags :