టిటిఎ మెగా కన్వెన్షన్ కు అంతా సిద్ధం...కమిటీ చైర్ లు వీరే...

టిటిఎ మెగా కన్వెన్షన్ కు అంతా సిద్ధం...కమిటీ చైర్ లు వీరే...

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో ఈ కన్వెన్షన్‌ జరగనున్నది. టిటిఎ అధ్యక్షుడు మోహన్‌ పాటలోళ్ళ ఆధ్వర్యంలో, కన్వెన్షన్‌కు కన్వీనర్‌గా ఉన్న శ్రీనివాస్‌ గనగోని సారధ్యంలో ఈ మెగా కన్వెన్షన్‌ జరుగుతోంది. కన్వెన్షన్‌ అడ్వయిజరీ కమిటీలో టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి, డా. విజయ్‌పాల్‌ రెడ్డి, డా. హరనాథ్‌ పొలిచెర్ల, డా. మోహన్‌ రెడ్డి పాటలోళ్ళ ఉన్నారు.

బాంక్వెట్‌ కమిటీకి ఉషా చింత చైర్‌ గా వ్యవహరిస్తున్నారు, బడ్జెట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటికీ పవన్‌ కె రవ్వ చైర్‌ గా వ్యవహరిస్తున్నారు. బిజినెస్‌ ఫోరం కమిటీకి మాణిక్యం చ్కెర్‌గా, సిఇ-సిఎంఇ కమిటీకి డా. సునీత కనుమూరి చైర్‌ గా, సెలబ్రిటీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీకి మహేష్‌ సంబు చైర్‌ గా, కార్పొరేట్‌ స్పాన్సర్‌షిప్‌ కమిటీకి వెంకట్‌ ఎక్కా అడ్వయిజర్‌గా ఉన్నారు. కల్చరల్‌ కమిటీకి అశోక్‌ చింతకుంట చైర్‌ గా వ్యవహరిస్తున్నారు. డెకరేషన్‌ కమిటీకి దీప జలగం అడ్వయిజర్‌గా ఉన్నారు. ఫుడ్‌ కమిటీకి విజయ్‌ భాస్కర్‌ చైర్‌ గా, ఫండ్‌ రైజింగ్‌ కమిటీకి సురేష్‌ వెంకన్నగారి, హాస్పిటాలిటీ కమిటీకి శివారెడ్డి కొల్లా, ఇమ్మిగ్రేషన్‌ ఫోరం కమిటీకి అజయ్‌ రెడ్డి చైర్‌ గా, మెట్రిమోనియల్‌ కమిటీకి సురేష్‌కుమార్‌ తండా చైర్‌ గా, మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ కమిటీకి నర్సింహా రెడ్డి మరియు విలాస్‌ జంబుల  చైర్‌ గా/ కో చైర్‌ గా, ఓవర్సీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీకి నవీన్‌ గోలి అడ్వయిజర్‌గా ఉన్నారు. పొలిటికల్‌ ఫోరం కమిటీకి సతీష్‌ మేకల చైర్‌ గా, ప్రోగ్రామ్‌ అండ్‌ ఈవెంట్స్‌ కమిటీకి సుధాకర్‌ ఉప్పల, రిసెప్షన్‌ కమిటీకి కిరణ్‌, రిజిస్ట్రేషన్‌ కమిటీకి రూపక్‌ కల్లూరి చైర్‌ గా వ్యవహరిస్తున్నారు. సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ కమిటీకి అరుణ్‌ చైర్‌ గా, సావనీర్‌ కమిటీకి శ్రీనివాస్‌ గూడూరు, ఆధ్యాత్మిక కమిటీకి రామకృష్ణ సన్నిధి, ట్రాన్స్‌పోర్టేషన్‌ కమిటీకి రామ్మోహన్‌ చిన్నల, వెండర్‌ అండ్‌ ఎగ్జిబిట్స్‌ కమిటీకి నరేష్‌ చింతలచెరువు చైర్‌ గా ఉన్నారు. వలంటీర్‌ కమిటీకి రంగారావు చైర్‌ గా, వెబ్‌ కమిటీకి నరేందర్‌ రెడ్డి చైర్‌ గా, ఉమెన్స్‌ ఫోరం కమిటీకి సంగీతారెడ్డి చైర్‌ గా వ్యవహరిస్తున్నారు.

 

 

Tags :