నెల్లూరు నాదే.. రాసిపెట్టుకోండి: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు నాదే.. రాసిపెట్టుకోండి: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

‘టీ బంకుల దగ్గర మాట్లాడే అందరికీ కూడా ఇదే చెప్తున్నా.. అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు.. రాసి పెట్టుకోండి’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గం మారుస్తారని పుకార్లు ప్రచారం కావడంతో అనిల్ ఆ విషయాలపై నియోజకవర్గంలో ఈ రోజు(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించి మరీ క్లారిటీ ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ తల వంచేది ఒక్క జగన్మోహన్ రెడ్డికే. ఆయన గీసిన గీత అనిల్ ఎప్పుడూ దాటడు అని మరొకసారి మళ్ళీ చెప్తున్నాను., అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా.. అందులో ఎలాంటి మార్పూ లేదు’ అని తేల్చి చెప్పారు. 

ఇదిలా ఉంటే నెల్లూరు సిటీలో అనిల్‌కి వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ వర్గం పావులు కదుపుతోందనే వాదనలున్నాయి. ఇప్పటికే నెల్లూరు నగర కార్పొరేటర్లలో చీలిక రాగా.. సగం మంది అనిల్ వర్గం వీడి రూప్ కుమార్ వర్గంలో చేరిపోయారట. ఇటీవలే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా ఈ బ్యాచ్ లోనే కలిసిపోయినట్లు తెలుస్తోంది. దీనికితోడు.. ఇరుగు పొరుగు నియోజకవర్గాల వారు కూడా అనిల్‌కి వ్యతిరేకంగా గూడుపుఠానీ చేన్నారనే అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి వారందరికీ కౌంటర్ ఇవ్వడానికే అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రెస్ మీట్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

 

Tags :