మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు

నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనరాణి బెయిల్ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని మెజిస్ట్రేట్ తెలిపింది. టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను హైదరాబాద్లో అరెస్ట్ చేసి చిత్తూరు తరలించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం నారాయణను జిల్లా ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అర్థరాత్రి 1:30 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లో నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ తరపు న్యాయవాదులు పేపర్లతో సహా అధారాలను న్యాయమూర్తికి చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.