ఈ విషయంలో మంత్రి కేటీఆర్ సైతం.. నాకు జూనియర్

టీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అశ్వారావుపేట ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో గిరిజన ప్రజా ప్రతినిధులకు అవమానాలే ఎదురయ్యాయి. నేను 1981లోనే సర్పంచ్‌గా గెలిచిన సీనియ్ నాయకుడి అని అన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సైతం నాకు జూనియర్ అవుతారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేసినప్పటికీ ఆయన ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం స్పందించకపోతే పార్టీ వీడటం ఖాయం అని స్పష్టం చేశారు.
Tags :