వైసీపీలో అర్హులైన నాయకులు లేనందునే.. తెలంగాణ నుంచి

వైసీపీలో అర్హులైన నాయకులు లేనందునే.. తెలంగాణ నుంచి

బటన్‌ నొక్కి నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్న జగన్‌, ఆ పథకాలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో సర్వే చేయించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన తుగ్లక్‌ కూడా నవ్వుకునేలా ఉందని ఎద్దేవా చేశారు. కేసులు నుంచి బయట పడేసేందుకే రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. నిరంజన్‌ రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య ఏపీలో ఏ జిల్లాకు చెందిన వారని అన్నారు. తెలంగాణకు చెందిన వారికి రెండు రాజ్యసభ సీట్లు ధారాదత్తం చేశారని ఆక్షేపించారు. వైసీపీలో రాజ్యసభకు అర్హులైన నాయకులు లేనందునే తెలంగాణ నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

 

Tags :