అందుకే బీజేపీలో చేరుతున్నా... క్లారిటీ ఇచ్చిన కొండా

అందుకే బీజేపీలో చేరుతున్నా... క్లారిటీ ఇచ్చిన కొండా

త్వరలోనే బీజేపీలో చేరాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్ణయించుకున్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అనుకున్నాం, కానీ అధ్వాన్నంగా తయారైందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి శూన్యం అన్నారు. ఉద్యమకారులను కేసీఆర్‌ పక్కన పెట్టారు.  తెలంగాణను వ్యతిరేకించిన పువ్వాడ అజయ్‌ కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంత్రులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజూరాబాద్‌ ఫలితాలే వస్తాయన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుందన్న విశ్వాసం ఉంది. నేను రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్‌ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. రేవంత్‌కు సకాంలో పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండేవాడ్ని అన్నారు.  బీజేపీ పూర్తి క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు. తానేమీ పదవులు  ఆశించిన బీజేపీలోకి వెళ్లడం లేదన్నారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరుతున్నాను. ఎప్పుడు ఎక్కడ బీజేపీలో చేరేది బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డికి వదిలేశా అని స్పష్టం చేశారు.

 

Tags :