నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రభుత్వం మధు సూదనాచారి పేరును ప్రతిపాదించింది. నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత  మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రభుత్వం మధుసూదనాచారి పేరును ప్రతిపాదించింది. ప్రభుత్వం పంపిన ఫైల్‌పై గవర్నర్‌ సంతకం చేశారు. తొలుత గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి కైశిక్‌ రెడ్డి పేరును ప్రతిపాదించగా కొన్ని కారణాల వల్ల ఆ ఫైల్‌ను గవర్నర్‌ హోల్డ్‌లో పేట్టారు. ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్‌ పేర్లను పరిశీలించి చివరకు మధుసూధనాచారికి అవకాశాన్ని కల్పించారు. దీంతో మధుసూదనాచారి ఎమ్మెల్సీగా నియమితులయ్యారు.

 

Tags :