విదేశాల్లో ఉన్నత విద్య కోసం ...ఎక్సిలా ఎడ్యుకేషన్ ఫెయిర్

విదేశాల్లో ఉన్నత విద్య కోసం ...ఎక్సిలా ఎడ్యుకేషన్ ఫెయిర్

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఎక్సిలా ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని తాజ్‌దక్కన్‌ హోటల్‌లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహించారు. యూకే, కెనడా దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల ప్రతినిధులు నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సంందేహాలను నివృత్తిగా  చేశారు. అడ్మిషన్‌, వీసా, ఫీజుల వివరాలను వెల్లడిరచారు. ఆయా యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌, గ్రాడ్యుయేషన్‌ చదవడం వల్ల మంచి నైపుణ్యాలు రావడంతో పాటు ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలు పొందేందుకు మార్గం ఏర్పడుతుందని సంస్థ అధినేత అరసవిల్లి అరవింద్‌, సీఈవో సౌజన్య రాసంశెట్టి తెలిపారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

Tags :