మీతోనే ముప్పు.....కాదు మీతోనే

మీతోనే ముప్పు.....కాదు మీతోనే

జపోరిజియా అణు విద్యుత్కేంద్రం దగ్గర పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఈ  కేంద్రానికి రష్యాతో ముప్పు ఉందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తుంటే, కీవ్‌ దళాలే కాల్పులు జరుపుతూ పరిస్థితిని క్లిష్టంగా మారుస్తున్నాయని రష్యా పేర్కొంటోంది. జపోరిజియాను కాపాడటంలో సాయపడాలని నాటో దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హామీ ఇవ్వాలని  ఓ వీడియో సందేశంలో కోరారు. మరోవైపు అణుకేంద్రానికి ఉక్రెయిన్‌తో ప్రమాదం పొంచి ఉందని రష్యా పేర్కొంది. ఇందుకు సంబంధించి తాము అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ( ఐఏఈఏ) తో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.  జపోరిజియాపై ఉక్రెయిన్‌ దళాలు భారీగా కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.