యుద్ధం మొదలైన తర్వాత..ఇదే మొదటిసారి!

యుద్ధం మొదలైన తర్వాత..ఇదే మొదటిసారి!

ఉక్రెయిన్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఆహార ధాన్యాల ఎగుమతుల పున ప్రారంభానికి ఇటీవల కుదిరిన ఒప్పందం మేరకు మొదటి రవాణా నౌక ఒడెస్సా నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. తుర్కియే రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. రజోని ఓడ ఒడెస్సా నౌకాశ్రయం నుంచి లెబనాన్‌లోని ట్రపోలీకి బయలుదేరింది. ఇది ఆగస్టు 2 నాటికి ఇస్తాంబుల్‌కు చేరుకుంటుంది. ఇక్కడ తనిఖీల అనంతరం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని తెలిపింది. ఈ నౌకలో 26 వేల టన్నుల మొక్కజొన్న రవాణా చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాల మంత్రి ఒలెక్సాండర్‌ కుబ్రకోవ్‌ తెలిపారు.

 

Tags :