అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్‌’ ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్..

అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్‌’ ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్..

‘అల వైకుఠ‌పురంలో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది.

వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

ఈ పక్క నాదే.. ఆ పక్క నాదే.. తలపైన ఆకాశం ముక్క నాదే..
ఆ తప్పు నేనే.. ఈ ఒప్పు నేనే.. తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే..
నన్నయితే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు..
పుట్టాడా అది మళ్ళా నేనే..
నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే..
నే తిప్పానా మీసమట.. సేతిలోన గొడ్డలట.. సెసిందే యుద్దమాట.. సేయందే సంధి అటా...
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)
నిను ఏట్లో ఇసిరేస్తా.. నే సేపతో తిరిగొస్తా..
గడ కర్రకు గుచ్చేస్తా.. నే జెండాలా ఎగరేస్తా..
నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా..
ఖరీదైన ఖనిజంలా మళ్లీ నేను దొరికేస్తా..
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)
ఎవడ్రా ఎవడ్రా నువ్వు  .ఇనుమును ఇనుమును నేను..
నను కాల్చితే కత్తి అవుతాను..
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. మట్టిని మట్టిని నేను..
నను తొక్కితే ఇటుకవుతాను..
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. రాయిని రాయిని నేను..
గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను..
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)

 

Tags :