ఎఫ్-1 వీసా దరఖాస్తు ఈసారి... కొత్తవారికి మాత్రమే

ఎఫ్-1 విద్యార్థి వీసా తిరస్కరణకు గురైన వారికి రానున్న దరఖాస్తుల్లో మరోసారి స్లాట్ ఇవ్వడం కుదరదని అమెరికా రాయబార కార్యాలయ మినిస్టర్ కౌన్సిలర్ డొనాల్డ్ ఎల్ హెఫ్లెన్ స్పష్టం చేశారు. ఢిల్లీ లోని రాయబార కార్యాలయ వెబ్‌పేజీలో నిర్వహించిన 45 నిమిషాల లైవ్ చాట్‌లో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యార్థి వీసాలకు ఈ ఏడాది జూన్‌తో పాటు జూలై ప్రథమార్థంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తాం. అయితే కేవలం తొలిసారి దరఖాస్తు చేస్తున్న వారికి మాత్రమే ఈసారి స్లాట్ కేటాయించాలని భావిస్తున్నాం అని హెప్లిన్ పేర్కొన్నారు.
Tags :