ఫేస్‌బుక్‌ గుడ్ న్యూస్... భారీ స్థాయిలో

ఫేస్‌బుక్‌ గుడ్ న్యూస్... భారీ స్థాయిలో

ఫేస్‌బుక్‌ భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌  చేపట్టనున్నది. రానున్న పదేళ్లలో పది వేల మందికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఉద్యోగ అవకావాలు కల్పించనున్నది. వర్చువల్‌ వరల్డ్‌ మెటావర్స్‌ నిర్మాణంలో భాగంగా ఈ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. మెటావర్స్‌ వర్చువల్‌ వరల్డ్‌లో డిజిటల్‌ టెక్నాలజీ సమ్మేళంగా ఉంటుంది. ఆల్‌లైన్‌ గేమ్స్‌, షాపింగ్‌, వర్కింగ్‌ దాని ద్వారా చేసుకోవచ్చు. నిష్ణాతులైన్‌ ఆన్‌లైన్‌ ఇంజనీర్లను రిక్రూట్‌ చేయనున్నట్లు ఫేస్‌బుక్‌ తన బ్లాగ్‌లో తెలిపింది.  జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, పోలాండ్‌, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ లాంటి దేశాల్లో ఎఫ్‌బీ రిక్రూట్‌మెంట్‌  డ్రైవ్‌ చేపట్టనున్నది. అయితే జాబితా దేశాల నుంచి బ్రిటన్‌ను విస్మరించినట్లు తెలుస్తోంది.

 

Tags :