విపక్షాలకు మరో షాక్.. రాష్ట్రపతి పోటీ నుంచి తప్పుకున్న ఫారూక్

విపక్షాలకు మరో షాక్.. రాష్ట్రపతి పోటీ నుంచి తప్పుకున్న ఫారూక్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ వారికి మరో షాక్‌ తగిలింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా నిరాకరించారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడిరచారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో తాను అక్కడే ఉండడం ముఖ్యమని ఫారూక్‌ తెలిపారు. తనకు మునుముందు యాక్టివ్‌ రాజకీయాలు ఎంతో ఉన్నాయని, జమ్మూకశ్మీర్‌ కోసం మరింత పాజిటివ్‌ సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన పేరు ప్రతిపాదించిన మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన సీనియర్‌ నేతలకు కూడా ఆయన థ్యాంక్స్‌ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికకు వివక్ష అభ్యర్థిగా మర్యాదపూర్వకంగా తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

 

Tags :