డొనాల్డ్ ట్రంప్ ఇంటిలో ఎఫ్‌బీఐ సోదాలు

డొనాల్డ్ ట్రంప్ ఇంటిలో  ఎఫ్‌బీఐ సోదాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ప్రైవేట్‌ క్లబ్‌, ఫ్లోరిడా లోని నివాసంపై ఎఫ్‌బీఐ దాడులు జరిపింది. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్‌హౌజ్‌ నుంచి రహస్య పత్రాలను తీసుకెళ్లారన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించింది. ఫ్లోరిడాలోని నా ఇంటిని ఎఫ్‌బీఐ ఏజెంట్ల స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడికి కూడా ఇలా జరగలేదు అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వైట్‌హౌజ్‌ను 2021 జనవరి లో ఖాళీ చేసే సమయంలో 15 డబ్బాల నిండా పత్రాలను తీసుకెళ్లారని, అందులో చాలా ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని నేషనల్‌ ఆరికవ్స్‌ చెప్పినట్టు సమాచారం.

 

Tags :