అమెరికా మరో కీలక నిర్ణయం... 18 ఏళ్ల పైబడిన వారందరికీ

అమెరికా మరో కీలక నిర్ణయం... 18 ఏళ్ల పైబడిన వారందరికీ

కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు మరింత భద్రత కోసం అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్‌ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఫైజర్‌, మోడెర్నా బూస్టర్‌ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతిచ్చింది. గతంలో 65 ఏళ్లు పైడినవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నావారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి మాత్రమే అమెరికా బూస్టర్‌ డోసులను అందించింది. తాజా నిర్ణయంతో 18 ఏళ్లు పైబడిన ఎవరైనా బూస్టర్‌ షాట్‌ తీసుకునేందుకు అర్హులే. దీంతో కోట్లాది మంది లబ్ది పొందనున్నారు. శీతాకాలంలో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశాలున్నాయంటూ వస్తోన్న నేపథ్యలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న ఆరు నెలలకు బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు అర్హులవుతారు.

 

Tags :