0.75% పెరిగిన ఫెడ్ రేట్లు : అమెరికా

0.75% పెరిగిన ఫెడ్ రేట్లు : అమెరికా

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు మరింత పెంచింది. కీలక వడ్డీ రేటును మరో 75 బేసిస్‌ పాయింట్లు (ముప్పావు శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో గత రెండు నెలల్లో ఫెడ్‌ కీలక వడ్డీ రేట్లను 1.5 శాతం పెంచినట్టయింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరడంతో ఫెడ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమెరికాలో కీలక వడ్డీ రేట్లు 2.25`2.5 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగితే అమెరికాలో ఈ ఏడాది చివరికి వడ్డీ రేట్లు 3.4 శాతానికి చేరతాయని భావిస్తున్నారు. ఫెడ్‌ తాజా నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

Tags :