అమెరికాపై భారత్ ఘన విజయం

అమెరికాపై భారత్ ఘన విజయం

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో తమ ఆరంభం సీజన్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. తమ చివరి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు 4-0 తేడాతో అమెరికాను చిత్తు చేసింది. వందన కటారియా (39, 54వ నిమిసాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటింది. సోనిక (54వ), సంగీత కుమారి (58వ) చెరో గోల్‌తో రాణించారు. మ్యాచ్‌ మొదలైన రెండు నిమిషాలకు అమెరికాకు గోల్‌ చేసే అవకాశం వచ్చింది. కానీ గోల్‌కీపర్‌ సవిత దాన్ని సమర్థంగా అడ్డుకుంది. ఆ తర్వాత భారత్‌ జోరు మొదలైంది. బంతిని నియంత్రణలో ఉంచుకున్న అమ్మాయిలు గోల్స్‌ వేటలో దూసు కెళ్లారు. ఆరంభంలో పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకున్నప్పటికీ మూడో క్వార్టర్స్‌ నుంచి దూకుడు ప్రదర్శించి ఫలితం రాబట్టారు.  14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 డ్రాలతో 30 పాయింట్లు సాధించిన భారత్‌ మూడో స్థానంలో నిలిచింది.

 

Tags :