అమెరికాతో భారత మహిళల ప్రొ లీగ్ హాకీ మ్యాచ్

హాకీ ప్రపంచకప్ ముందు అమెరికాతో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్‌ల్ని భారత మహిళల జట్టు సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. అమెరికాతో భారత్ రెండు మ్యాచ్‌ల్లో తలపడనుంది. జులై 1 నుంచి 17 వరకు స్పెయిన్ నెదర్లాండ్స్ ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడనున్న చివరి మ్యాచ్‌లు ఇవే. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ సీజన్లో తొలిసారిగా బరిలో దిగిన భారత్ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంంది. 14 మ్యాచ్‌ల్లో 24 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ ద్వితీయ స్థానంలో కొనసాగుతుండగా అర్జెంటీనా ఇప్పటికే టైటిల్ కైవసం చేసుకుంది. ఇక సవిత పూనియా సారథ్యంలోని భారత జట్టు విజయాలతో లీగ్‌ను ముగించాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్‌కు ముందు తన బలాల్ని మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.
Tags :