అమెరికాలో గ్లోబల్ కార్పొరేటు దిగ్గజాలతో నిర్మల సీతారామన్

అమెరికాలో  గ్లోబల్ కార్పొరేటు దిగ్గజాలతో  నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికాలో గ్లోబల్‌ కార్పొరేటు దిగ్గజాలతో కీలక చర్చలు జరిపారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు, సంస్కరణలు, సంబంధిత అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరిచారు. ఫిక్కి, యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం, గ్లోబల్‌ కార్పొరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, హార్వర్డ్‌ వర్సిటీ విద్యార్థులు సంయుక్తంగా నిర్వహిస్తున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ భేటీలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తుల్లో బెయిన్‌ క్యాపిటల్‌కు చెందిన జాన్‌ కనౌటన్‌, అమెరికన్‌ టవర్‌ కార్పొరేషన్‌కు చెందిన ఎడ్మండ్‌ డిసాంటో, పెర్కిన్‌ ఎల్మర్‌ ప్రెసిడెంట్‌, సీఈవో ప్రహ్లాద్‌ సింగ్‌, ఎగ్జాన్‌ మొబైల్‌కు చెందిన డా.జాన్‌ ఆర్డిల్‌ ఉన్నారు. భారత్‌ ఆర్థిక వ్వవస్థపై విశ్వాసం, ప్రస్తుత సంస్కరణల నేపథ్యంలో పెట్టుబడులపై కార్పొరేటు దిగ్గజాలు ఆసక్తిని తెలిపారు.

వరల్డ్‌ బ్యాంక్‌ ఐఎంఎఫ్‌ల వార్షిక సమావేశాలు, జీ20 ఆర్థిక మంత్రుల సదస్సు, ఎఫ్‌ఎంసీబీసీ(ఎఫ్‌ఎంసీబీసీ) సదస్సుల్లో పాల్గొనేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ అమెరికా చేరుకున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ జనెత్‌ యెల్లెన్‌ను కలిసే అవకాశం ఉంది. అమెరికా చేరిన సీతారామన్‌ యూఎస్‌ ట్రెజరీ మాజీ సెక్రటరీ లారెన్స్‌ సమ్మర్స్‌ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. బోస్టన్‌లో నిర్వహించిన ఈ విందులో ఆర్థిక, పబ్లిక్‌ పాలసీ, ఫైనాన్స్‌, డెవలప్‌మెంట్‌కు చెందిన నిపుణులు కూడా పాల్గొన్నారు. సమగ్రాభివృద్ధి, వృద్ధి పరంగా భారత్‌ దూసుకుపోవాలనుకుంటున్నట్టు సీతారామన్‌ భేటీలో వివరించారని ప్రహ్లాద్‌ సింగ్‌ జోషీ తెలిపారు.

 

Tags :