జిల్లా న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి : జస్టిస్ ఎన్వీ రమణ

జిల్లా న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి : జస్టిస్ ఎన్వీ రమణ

జిల్లా న్యాయ స్థానాలను మరింత బలోపేతం చేయాలని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ లోని విజ్ఞాన్‌ భవన్‌లో తొలిసారిగా జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా న్యాయ ఉద్యమాన్ని చేపట్టడంలో జిల్లా కోర్టులు చోదకాలుగా పనిచేస్తాయన్నారు. చాలా వరకు కేసులో జిల్లా జుడిషియల్‌ అధికారులే కాంటాక్ట్‌ లోకి వస్తారని, జిల్లా న్యాయస్థానాల వద్ద తమకు కలిగిన అనుభవాల ద్వారానే న్యాయవ్యవస్థపై ప్రజల్లో ప్రజాభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యంత అవసరమని, దేశంలో న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయస్థానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదన్నారు.

ఈ దేశ నిజమైన బలం యువతలోనే ఉందన్నారు. ప్రపంచంలో ఐదో వంతు యువత మన దేశంలోనే ఉంది. అయితే మన శ్రామిక శక్తిలో నైపుణ్యవంతులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారు. మిగతావారిలోనూ నైపుణ్యాలను పెంచి ఆ శక్తిని ఉపయోగించుకోవాలి అని అన్నారు.

 

Tags :