ఈ నెల 24న వాషింగ్టన్ లో క్యాడ్ దేశాధినేతల సమావేశం

ఈ నెల 24న వాషింగ్టన్ లో క్యాడ్ దేశాధినేతల సమావేశం

ఈ నెల 24న క్యాడ్‍ దేశాధినేతల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాషింగ్టన్‍లో జరిగే ఈ సమావేశానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‍, భారత్‍ దేశాల అధినేతలు హాజరవుతారు. మార్చిలో ఆన్‍లైన్‍లో ఈ నాలుగు దేశాల మొదటి సమావేశం జరిగింది. కోవిడ్‍ వ్యాక్సిన్‍ పంపిణీ, వాతావరణ సమస్యలు, పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడంలో భాగంగా భద్రతాంశాలపై చర్చిచేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. పదవి నుండి వైదొలగుతున్న జపాన్‍ ప్రధాని యోషిడెసుగా ఈ సమావేశానికి హాజరవుతారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍తో కూడా ఆయన చర్చలు జరుపుతారని తెలిసింది.

 

Tags :