అమెరికాలో ఇడా బీభత్సం...రాత్రికి రాత్రే 44 మంది

అమెరికాలో ఇడా బీభత్సం...రాత్రికి రాత్రే 44 మంది

అమెరికాను వరుస హరికేన్లు వణికిస్తున్నాయి. తాజాగా ఇడా తుపాను పంజా విసురుతోంది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలు న్యూయార్క్ లో విషాదాన్ని నింపాయి. ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా రాత్రికి రాత్రే కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలను చారిత్రాత్మక వాతావరణ సంఘటనగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వరదల వల్ల న్యూయార్క్ వీధులు నదుల్లా మారాయి. సబ్‍ వేలోని ట్రాకులన్నీ నీట మునగడంతో సబ్‍ వే సేవలను ఆపేశారు. వరద బీభత్సం నేపథ్యంలో న్యూయార్క్లో ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు.

వరదల గురించి 50 ఏళ్ల మెటోడిజి మిహజ్లోవ్‍ అనే వ్యక్తి మాట్లాడుతూ తన జీవితంలో ఇలాంటి భారీ వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. మన్‍ హట్టన్‍లో ఆయన రెస్టారెంట్‍ను నిర్వహిస్తున్నారు. తన రెస్టారెంట్‍లో మూడు ఇంచుల మేర నీరు నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిని తాను నమ్మలేకపోతున్నానని ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్‍ కలుగుతోందని చెప్పారు.

 

Tags :