క్రికెటర్ లకు అమెరికా వీసాలు

క్రికెటర్ లకు అమెరికా వీసాలు

వెస్టిండీస్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సంబంధించి చివరి రెండు మ్యాచ్‌లకు ఇరు జట్ల ఆటగాళ్లకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి. సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు ఫ్లోరిడాలో జరగాల్సి ఉంది. అయితే వీసా జారీలో జాప్యం అవడంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలి జోక్యంతో మార్గం సుగమమయింది. విండీస్‌ పర్యటన ఆటంకాలతో ఆరంభమైన విషయం తెలిసిందే. జట్ల కిట్‌ రాక ఆలస్యంతో రెండో మ్యాచ్‌ మూడు గంటలు ఆలస్యంగా ఆరంభం కాగా, మూడో మ్యాచ్‌ గంటన్నర ఆలస్యంగా నిర్వహించారు. ఇప్పుడు వీసాల జారీలో దేశాధ్యక్షుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒక వేళ వీసాలు సకాలంలో జారీ కాని పక్షంలో చివరి రెండు మ్యాచ్‌లు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కానీ ఆటంకాలు తొలగడంతో యథావిధిగా ఫ్లోరిడాలోని బౌల్డరహిల్స్‌లో స్టేడియంలో చివరి రెండు మ్యాచ్‌లు యథాతథంగా జరుగనున్నాయి.

 

Tags :