కేంద్రం సంచలన ప్రకటన...

కేంద్రం సంచలన ప్రకటన...

ఇంటర్నెట్‌ సురక్షిత వాడకంగానే కాదు, నిషేధించిన, మన దేశంలో అందుబాటులో లేని కంటెంట్‌ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గంగా వీపీఎన్‌ సేవలపై ఓ విమర్శ ఉంది. అయితే ఈ సేవలపై కేంద్రం  ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో నిబంధనలకు, మార్గదర్శకాలకు లోబడి నడుచుకోవాలని, కుదరదనుకుంటే భారత్‌ నుంచి శాశ్వతంగా నిష్క్రమించొచ్చని వీపీఎన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటన చేశారు. కేంద్రం ఇదే మొండి నిర్ణయంతో ముందుకు వెళ్తే వీపీఎన్‌ సేవలను ఉపయోగిస్తున్న 27 కోట్ల మంది యూజర్లపై ప్రభావం పడడం ఖాయం. భారత్‌ చట్టాలను, నిబంధనలను అనుగుణంగా ఉండనివాళ్లకు అవకాశం ఇచ్చేదే లేదు. కుదరదని అనుకుంటే నిర్మొహమాటంగా సర్వీసులను దేశంలో నిలిపివేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. అంతేకాదు వీపీఎన్‌ కంపెనీలు, డేటా సెంటర్‌ కంపెనీలు, వర్చువల్‌ ప్రైవేట్‌ సర్వర్‌ ప్రొవైడర్లు, యూజర్ల డాటాను కనీసం ఐదేళ్లపాటు భద్రపరచాల్సిందేనని స్పష్టం చేశారు.

 

Tags :