భారత్ లో కార్ల తయారీకి మంగళం పాడిన ఫోర్డ్?

భారత్ లో కార్ల తయారీకి మంగళం పాడిన ఫోర్డ్?

మహీంద్రాతో ఫోర్డస్ జాయింట్‍ వెంచర్‍ ముగిసిన తర్వాత అమెరికన్‍ బ్రాండ్‍ భారత కార్యకలాపాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత కార్యకలాపాల కోసం నూతన భాగస్వామిని అన్వేషిస్తున్నామని ఫోర్డ్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించినా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. భారత్‍ ఆపరేషన్స్ ను ఫోర్డ్ నిలిపివేస్తుందని మీడియాలో కధనాలు వెల్లువెత్తాయి. ఇక భారత్‍లో కార్యకలాపాలను ముగిస్తున్నామని, దేశంలో కార్ల తయారీని నిలిపివేస్తామని పోర్డ్ ధ్రువీకరించింది. స్ధానిక తయారీ యూనిట్‍ను మూసివేసినా కస్టమర్లకు సర్వీస్‍ సపోర్ట్ ను ఫోర్డ్ కంపెనీ కొనసాగిస్తోంది. భారత్‍లో స్ధానికంగా కార్ల తయారీని ఫోర్డ్ నిలిపివేసినా కొన్ని దిగుమతి చేసుకున్న కార్ల విక్రయాలను చేపడుతుందని భావిస్తున్నారు. 

 

Tags :