మాజీ మంత్రి బొజ్జ గోపాలకృష్ణారెడ్డి ఇక లేరు

మాజీ మంత్రి బొజ్జ గోపాలకృష్ణారెడ్డి ఇక లేరు

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా  ఆయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబినెట్‌లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. బొజ్జల మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

 

Tags :