మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు  అస్వస్థత

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మన్మోహన్‌ సింగ్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం బలహీనంగా ఉండి, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 88 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌  ఏప్రిల్‌ 19న  కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 4న, ఏప్రిల్‌ 3న కొవిడ్‌ టీకా తీసుకున్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రస్తుతం రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2004`2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు.

 

Tags :