బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్

బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) వ్యవస్థాపకుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, కిరణ్‌ రిజుజు, బీజేపీ నేత సునీల్‌ జాఖడ్‌, పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మ సమక్షంలో ఆయన కమల దళంలో చేశారు. ఈ సందర్భంగా కిరణ్‌ రిజుజు కెప్టెన్‌ను కాషాయ కండువా కప్పి తమ పార్టీకి సాదరంగా ఆహ్వానించగా, తోమర్‌ పార్టీ సభ్యత్వ రశీదును అందజేశారు. అలాగే కాంగ్రెస్‌ వీడిన తర్వాత ఏర్పాటు చేసిన పీఎల్‌సీ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తున్నట్లు కెప్టెన్‌ ప్రకటించారు.

 

Tags :