ఇక ఉండలేను గుడ్‌ లక్‌.. గుడ్‌బాయ్‌ కాంగ్రెస్

ఇక ఉండలేను గుడ్‌ లక్‌..  గుడ్‌బాయ్‌ కాంగ్రెస్

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు జలక్ తగిలింది.పార్టీ సీనియర్‌ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గుడ్‌ లక్‌ గుడ్‌బాయ్‌ కాంగ్రెస్‌ అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా హైకమాండ్‌పై సునీల్‌ జాఖడ్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత, హైకమాండ్‌ ఒక్కరి మాటే వింటోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమ కుటుంబంలోని మూడు తరాల వారు కాంగ్రెస్‌కు సేవలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.తాను పార్టీ విధి విధానాల ప్రకారం నడుచుకోలేదని, అన్ని పదవులను తన నుంచి లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు.

 

Tags :