టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమని, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ భాగలక్ష్మీ టీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున ఆయన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్‌ విప్‌గానూ ఓదెలు పనిచేశారు. బాగ్యలక్ష్మికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైనే ఉంది.

 

Tags :