అదే జరిగితే అమెరికా చరిత్రలో... ఇదే మొదటిసారి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు మరో కేసు చుట్టుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో తన పాత బాగోతాలు బయటపడకుండా ఉండేందుకు నీలి చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్ సహా మరికొందరికి ఆయన డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వచ్చే వారం వాంగ్మూలం ఇవ్వడానికి రావాలసిందిగా న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‌ను ఆహ్వానించింది. ఆయనపై నేర అభియోగాల నమోదు దిశగా ఇది తొలిమొట్టు అని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షునిపై నేరాభియోగం నమోదు చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. డేనియల్స్‌లో తన అక్రమ సంబంధాల గురించి బయటపెట్టవద్దంటూ ఆమెకు ట్రంప్ 1,30,000 డాలర్లు ముట్ట జెప్పారనే ఆరోపణ మీద న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ విచారణ జరుపుతోంది.
Tags :